బాసర, ఫిబ్రవరి 28: ఆర్జీయూకేటీ బాసరలో బయోసైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సతీశ్ కుమార్ మాట్లాడారు. సైన్స్ ప్రాధాన్యతను నేటి అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు వివరించారు. అనంతరం వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు డాక్టర్ అబ్దుల్ అజీమ్, డాక్టర్ కవిత మన్యం, డాక్టర్ రాంబాబు గుండ్ల మాట్లాడారు. దైనందిన జీవితంలో సైన్స్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రపంచ సవాళ్లను తగ్గించడంలో, మానవ సంక్షేమానికి భరోసా ఇవ్వడంతో పాటు శాస్త్రీయ జ్ఞానాన్ని, విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్వోడీలు రాకేశ్ రెడ్డి, డాక్టర్ శోభాదేవి, చింతనరేష్, ప్రొఫెసర్లు డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ మధుసూదన్, రామారావు, డాక్టర్ శ్రీనివాస్, రాకేశ్, రోషణ్, డాక్టర్ విఠల్, డాక్టర్ కాశన్న పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీని సందర్శించిన కలెక్టర్
బాసర ట్రిపుల్ ఐటీని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్న ఆయనకు డైరెక్టర్ సతీశ్ కుమార్ ఆహ్వానం పలికారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుణ్‌రెడ్డి మొదటిసారిగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థులకు సమకూరుస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఈసెల్, అటల్ ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
విద్యార్థులు ఎప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో వచ్చే సమస్యలకు పరిష్కార మార్గాలు కను క్కోవాలన్నారు. ప్రదానంగా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని చెప్పారు. ట్రిపుల్ ఐటీలో వసతులను ఉపయోగించుకొని యూనివర్శిటీతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ అందజేశారు. ప్రముఖ 17 కంపెనీలతో బాసర ట్రిపుల్ ఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుందని వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులకు మర్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీ టీహబ్ సీఈవో రాజేశ్ కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.