మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 22 : జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి డీఈవో యాదయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ గణితంపై మక్కువ పెంచుకున్నట్లయితే జీవితంలో అనేక సమస్యలను పరిష్కరించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఇష్టంతో ప్రాక్టీస్ చేస్తే సులభమైన సబ్జెక్టు అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోలు చౌ దరి, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఎంఈవో పోచయ్య, జిల్లాలోని ఎంఈవోలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. గణిత దినోత్సవాన్ని మంచిర్యాలలోని పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన 100 గణిత నమూనాలు, ‘రామన్న తెచ్చాడన్న – గణితమన్న’, ‘రామానుజన్ దేశానికే ఆదర్శప్రాయుడు’ అనే నాటికలు ఆలోచింపజేశాయి. విద్యార్థులు పాడిన గేయాలు ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్కక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సూర్యనగర్‌లోని రైసింగ్ సన్ పాఠశాలలో విద్యార్థులు చతురస్రాకారం, వృత్తం, త్రిభుజాకారంలో కూర్చొని గణితంపై మక్కువను చాటారు. రామానుజన్ చిత్ర పటానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఉస్మాన్‌పాషా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగాడ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
దండేపల్లి, డిసెంబర్ 22: దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీరామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రాన్ని చేతులపై ముద్రించుకొని గణిత అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శంకర్‌గౌడ్, గణిత ఉపాధ్యాయులు ప్రమోద్‌కుమార్, శ్రీనివాస్, రవీందర్, రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జన్నారం, డిసెంబర్ 22 :మండల కేంద్రంలోని సూపర్ స్లేట్స్ హైస్కూల్లో శుక్రవారం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో 5 వందల మంది విద్యార్థులు ప్రదర్శించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎఫ్ఆర్వో హఫీసొద్దీన్, స్లేట్స్ హైస్కూల్ పౌండర్ ఏనుగు సుభాష్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటర్ ఏనుగు రజితారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ పూజ, సీబీఎస్బీ స్కూల్ ప్రిన్సిపాల్ యేసు మరియ, ఎల్లం, బీట్ ఆఫీసర్ రహీం, ఉపాధ్యాయులు, కృష్ణ, కిరణ్, రాజన్న, రంజిత్, భాను చందర్, విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.
లక్షెట్టిపేట, డిసెంబర్ 22: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌లో శ్రీరామనుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు లావణ్య, లత, మమత, రవళి విద్యార్థులున్నారు.
చెన్నూర్ టౌన్, డిసెంబర్ 22 : ప్రజల్లో గణితంపై అవగాహన, సానుకూల దృక్పథం పెంపొందించేందుకే జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చెన్నూర్ పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలతో పాటు, చిన్నమున్షి, లయోలా పాఠశాలల్లో మాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు.
కోటపల్లి, డిసెంబర్ 22 : కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రంగవల్లులు, క్విజ్ తదితర పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్ లావణ్య, వార్డెన్ సుమలత, ఉపాధ్యాయులు మమత, శ్రీనివాస్, సుధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
మందమర్రి, డిసెంబర్ 22: మందమర్రి మండల పరిధిలోని గద్దరాగడిలో గల గ్రీన్వుడ్ పాఠశాలలో విద్యార్థులు 200 గణిత ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రమోహన్, అయూబ్, ఉపాధ్యాయురాలు ఫరీదా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, డిసెంబర్ 22: బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ టీ స్రవంతి, జేవీపీ మోహన్, గణిత ఉపాధ్యాయులు సృజన, భానేశ్, అశోక్, రవీందర్, ప్రియాంక, విద్యార్థులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, డిసెంబర్ 22 : కన్నెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత దినోత్సవంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గణితంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 22 : నాగాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శారద ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీనివాస రామానుజం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 22: మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) శివ, ఎఫ్‌బీవో రవీందర్ అన్నారు. కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ అర్బన్ పార్కును సందర్శించారు. హెచ్ఎం రమేశ్, జావాద్, భానేశ్ తదితరులు పాల్గొన్నారు.