కాగజ్నగర్, నవంబర్ 17: పట్టణంలోని పటేల్ గార్డెన్లో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1100 మంది విద్యార్థులు హాజరయ్యారు.
స్థానిక ఎక్సెల్ స్కూల్ విద్యార్థి శేక్ ఫజల్ ప్రతిభకనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే రాష్ట్ర కో ఆర్డినేటర్ కంటేశ్వర్, నిర్వాహకుడు కుకుడే సంతోశ్ పాల్గొన్నారు.