రెబ్బెన, జనవరి 5 : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీ య స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన క్రీడాకారిణులు ఆత్రం స్వప్న, రిక్కల విష్ణుప్రియ ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.నారాయణరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర మహిళా జట్టు కెప్టెన్గా ఆత్రం స్వప్న వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులను వివిధ సంఘాల ప్రతినిధులు నర్సింగం, ఎస్.తిరుపతి, భాస్కర్, ఆర్.శ్రీనివాసరెడ్డి, మహేందర్రెడ్డి, మారిన వెంకటేశ్వర్లు, శంకర్, సీనియర్ క్రీడాకారులు లక్ష్మణ్, సాంబయ్య, సదానందం, లింగరెడ్డి, హరిలాల్, మల్లేశ్, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, రెడ్డి సతీశ్, తౌఫీక్, సతీశ్, చిన్ని అభినందనలు తెలిపారు.