దండేపల్లి, మే15: ‘ధాన్యం కొనండి మహాప్రభో..’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఐకేపీ అధికారులు బుధవారం స్పందించారు. దండేపల్లి మండలంలోని వందూర్గూడకు చెందిన రైతుల ధాన్యాన్ని తానిమడుగు ఐకేపీ సెంటర్లో బుధవారం తూకం వేశారు.
నెల రోజులుగా కొనుగోలు కేంద్రానికి తరలించిన వడ్లను కొనడం లేదని రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. బుధవారం ప్రచురితమైన కథనానికి ఐకేపీ అధికారులు, సిబ్బంది స్పందించి వెంటనే హమాలీలతో తూకం వేయించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.