నీలగిరి, జూన్ 3 : సమస్యల పరిష్కారానికి చేపట్టిన పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. నాలుగో విడుత పట్టణ ప్రగతిని పానగల్‌లోని 1,2 వార్డుల్లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో కాలనీల్లో అవసరాలను గుర్తించి ప్రణాళిక తయారు చేసుకుని అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పానగల్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను సిద్ధ్దం చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, బుర్రి రజితావెంకన్న, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లిరామరాజు, టీఆర్ఎస్ నాయకులు అలకుంట్ల మెహన్‌బాబు, మాలె శరణ్యారెడ్డి పాల్గొన్నారు.
మర్రిగూడ : పల్లెప్రగతి పనుల్లో అధికారులు, సర్పంచులు నిర్లక్ష్యం వహించరాదనిఅదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామసభలో పాల్గొని ఆయన మాట్లాడారు.గ్రామాల్లో క్రీడా మైదానాలకు స్థల సేకరణ చేయాలన్నారు. అలాగే మండల వ్యాప్తంగా సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్,ఎంపీఓ ఝాన్సీ, సర్పంచులు మునగాల సుధాకర్‌రావు,నల్ల యాదయ్య, కల్లు స్వాతీనవీన్రెడ్డి, కుంభం నర్సమ్మ, చిట్యాల సబితాయాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : పల్లె ప్రగతిలోప్రజలు భాగస్వాములు కావాలని నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి కోరారు. మండలంలోని ముషంపల్లిలో చేపట్టిన పల్లెప్రగతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. మురుగునీరు వీధుల్లో పారకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, క్రీడా ప్రాంగణానికి స్థలాన్ని పరిశీలించారు. అలాగే పలు సమస్యలపై గ్రామ సభలో నివేదికలు తయారు చేసి గ్రామ ప్రత్యేకాధికారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సుమన్, ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, సర్పంచులు బైరెడ్డి వెంకట్‌రెడ్డి, నర్సింహ, వెం కన్న, పుష్ప, మన్నె కృష్ణార్జున్‌రెడ్డి ,నాగయ్య, జాన్‌రెడ్డి, సరిత, సరస్వతి, శైలజ, యాదమ్మ, ఎంపీటీసీ బీరం స్వాతి, రాజుపేట మల్లేశ్ పాల్గొన్నారు.
నాంపల్లి : పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ సూచించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తాసీల్దార్ లాల్‌బహుదూర్, ఎంపీడీఓ శేషుకుమార్, సర్పంచ్ కుంభం విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణ్ణారెడ్డి, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ రామచంద్రయ్య పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని ఏనుగులదోరి గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకయ్య, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచ్ మహేశ్వరపు సతీశ్, గ్రామ ప్రత్యేకాధికారి మంగమ్మ, పీఆర్ఏఈ మోహన్ పాల్గొన్నారు.
చిట్యాల: పట్టణంలో పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి అధికారులతో పర్యటించి సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిట్యాల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, హెచ్ఎం రాధిక, మేనేజర్ నుజత ఫాతిమా, నరేందర్‌రెడ్డి, పొన్నం లక్ష్మయ్య, కోమటిరెడ్డి అమరేందర్‌రెడ్డి, గంటా శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు : పల్లె ప్రగతితో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని ఎంపీపీ కర్నాటి స్వామి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, గ్రామసభలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ మిర్యాల వెంకన్న , మండల ప్రత్యేకాధికారిఎస్.వీ.ప్రసాద్, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, ఎంపీఓ సుమలత పాల్గొన్నారు.
చండూరు : మండలంలోని కొండాపురం గ్రామ సభలో ఎంపీపీ పల్లె కళ్యాణి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరంగ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ. జానయ్య, ఎంపీఓ స్వరూపరాణి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం గ్రామసభలు నిర్వహించి,ర్యాలీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చలు జరిపారు.అనంతరం ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చు జానకీరాములు, ఎంపీడీఓ భవాని, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, పంచాయతీ కార్యదర్శి నాగమణి పాల్గొన్నారు.
తిప్పర్తి: పల్లె ప్రగతి ప్రారంభం సందర్భంగా మండలంలోని రామలింగాలగూడెంలో సర్పంచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ముత్తినేని శ్యాంసుందర్ పాల్గొన్నారు.