Nagoba Temple | నాగోబా దేవస్థానం ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనం : కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Nagoba Temple | మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోనిగిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని శుక్రవారం రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోని గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని (Nagoba Temple ) శుక్రవారం రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ( Bakki Venkatayya) , కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మెశ్రం వంశీయులు నాగోబా దేవాలయ చరిత్ర, మెశ్రం వంశీయుల సంప్రదాయాలు,నాగోబా జాతర విశిష్టత, గిరిజనుల ఆచార వ్యవహారాల గురించి వివరించారు. చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ నాగోబా దేవాలయం తెలంగాణ గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. నాగోబా జాతర దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి ప్రతిబింబమని, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గొప్ప వారసత్వమని పేర్కొన్నారు.

గిరిజన సమాజం తమ మూలాలను, సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.కమిషన్ సభ్యులు ఆలయ పరిసరాలను పరిశీలించి, దేవాలయ విశిష్టత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యులు, మెశ్రం వంశీయుల పెద్దలు, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

