ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8 : మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయులు గత నెల 31న నాగోబాకు నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన జాతర మంగళవారంతో ముగిసింది. అధికారికంగా ముగిసినా అనధికారికంగా మరో రెండురోజులపాటు కొనసాగనుంది. వందలామంది భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. కార్యక్రమంలో నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, దేవాదాయ శాఖ అధికారులు మహేష్, రాజమౌళి, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు. నాగోబా జాతర హుండీలను మంగళవారం లెక్కించారు. మెస్రం వంశీయులతోపాటు ఆలయ కమిటీ, రెవెన్యూశాఖ, దేవాదాయశాఖ, ఐటీడీఏ, పోలీస్‌శాఖకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. నాగోబా జాతర మొత్తం ఆదాయం రూ. 13,05,441 వచ్చినట్లు దేవాదాయశాఖ ఈవో మహేశ్ తెలిపారు. భక్తుల కానుకల ద్వారా రూ. 6,19441, తైబజార్ ద్వారా 5.09 లక్షలు ఆదాయం వచ్చింది. వాహనాల పార్కింగ్ ద్వారా రూ.80 వేలు, విద్యుత్ సరఫరా ద్వారా రూ. 26 వేలు, మురుమురాల ద్వారా రూ. 30వేలు, రంగుల రాట్నాల ద్వారా రూ. 50వేలు వచ్చాయి. భక్తులు సమర్పించిన వెండి 710 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, ఎస్ఐ నాగ్నాథ్, దేవాదాయశాఖ ఈవో మహేశ్, మెస్రం ఆనంద్‌రావ్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, మెస్రం వంశీయులు బాధిరావ్‌పటేల్, జంగుపటేల్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, గణపతి, తిరుపతి, కటోడ మెస్రం కోసురావ్, కటోడ హనుమంత్‌రావ్, కటోడ కోశరావ్, దేవ్‌రావ్, సోనేరావ్, జంగుపటేల్, తుకారాం, శేఖర్‌బాబు, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.