ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 22 : పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చండీ ఉపాసకుడు పాలెం మనోహర శర్మ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. గంగనీళ్ల జాతర సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వరకు శోభాయాత్రగా వెళ్లారు. శాంతినగర్‌లోని గ్రామదేవత సార్గమ్మతల్లికి పూజలు చేశారు. గోదావరిలో అమ్మవారి విగ్రహాలకు జలాభిషేకం చేశారు. గంగతెప్పకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో గోదావరి జలాలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో అర్చకుడు నిమ్మగడ్డ శరత్‌చంద్రశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు అయిల్నేని అశోక్‌రావు, వెంకటప్పయ్య, నాగేందర్ రావు, సింగు ప్రవీణ్, సిరిగారపు లింగన్న, శాంతినగర్ యువజన సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ తెలిపారు.