ముథోల్, అక్టోబర్ 19 : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని రువ్వి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగా ణలో రైతు బీమా, రైతురుణ మాఫీ, కేసీఆర్ కిట్ తో పాటు అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. మళ్లీ ఓసారి ఆదరించి గెలిపించాలని కోరారు. ఇప్పటికే తెలంగాణ దేశం లోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను పలువురు సన్మానిం చా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్య క్షుడు అఫ్రోజ్ ఖాన్, నాయకులు రవీందర్ రెడ్డి, పోశెట్టి, గౌతం, మురళి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.