భైంసా టౌన్/కుభీర్, జనవరి 8 : ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ మండలం అబ్దుల్లాపూర్కు చెందిన ఆర్ భోజవ్వకు రూ. 16 వేలు, తానూర్ మండలం బెంబర్కు చెందిన ఎస్ పీరాజీకి రూ. 28 వేలు, కుభీర్ మండలం కుప్టికి చెందిన బీ పాండురంగ్‌కు రూ. లక్ష, వర్నికి చెందిన జీ లక్ష్మణ్‌కు రూ. 11 వేలు, కుభీర్ మండలం నిగ్వా గ్రామానికి చెందిన భూ లక్ష్మికి రూ. 60 వేలు, భైంసా మండలం బిజ్జూర్ గ్రామానికి ఎస్ భోజారెడ్డికి రూ.30వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయ్యాయి.
ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి దేగాంలోని తన నివాసంలో ఆదివారం ఆ చెక్కులు అందజేశారు. కోతుల్గాం అన్నాబాహు సాటే సంఘం సభ్యులు సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా త్వరలో మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు రావాలని కోరుతూ భైంసా, కుభీర్, ఎంఈవోలు సుభాష్, చంద్రకాంత్, ప్రధానోపాధ్యాయుడు రమణారావు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం టీఎస్ ఎంఈడబ్ల్యూఏ (తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్) క్యాలెండర్‌ను విడుదల చేశారు. టాక్లీ గ్రామంలో ఎన్నికల బూత్‌ను ఏర్పాటు చేయాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. సచిన్ పటేల్, భూమేశ్, వెంకట్ రెడ్డి, కుప్టి సర్పంచ్ రమేశ్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, యకీనొద్దీన్, వైస్ ఎంపీపీ మొహినొద్దీన్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర సంచాలకుడు రేకుల గంగాచరణ్, ఫారూఖ్, సంజు పటేల్, కోఆప్షన్ సభ్యులు గజానంద్, దత్తు, ఆరిఫ్, కోఆప్షన్ సభ్యుడు దత్తహరి, నిగ్వ ఎంపీటీసీ దొంతుల దేవీదాస్, మాజీ ఎంపీటీసీ బండి సుభాష్, బందెల విఠల్, గాడేకర్ రమేశ్, దాసరి మల్లారెడ్డి, జలాల్, దేశెట్టి సాయన్న ఉన్నారు.
కుంటాల, జనవరి 8 : ఆలయాల అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలం విఠాపూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ దేవతలతో పాటు పోచమ్మ ఆలయ నిర్మాణంపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచ్ లక్ష్మీ రమేశ్, బీఆర్ఎస్ నాయకులు ఏ సుదర్శన్ రెడ్డి, విఠల్ రావు పటేల్, అశోక్ ఉన్నారు. ఉమ్మడి కుంటాల మండలంలోని బూర్గుపల్లి (జీ) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనిల్ తండ్రి బాహురావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పరామర్శించారు. బాహురావు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నర్సాపూర్, కుంటాల మండలాల బీఆర్ఎస్ కన్వీనర్లు పడకంటి పాపెన్ రాజేశ్వర్, పడకంటి దత్తు, సర్పంచ్ శ్రావణ్, బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి రమేశ్, రాజేశ్వర్, ఉత్తం, భీంరావు, శ్రీను, రాజు, అర్జున్, వసంత్, సోషల్ మీడియా ఇన్చార్జి రంగరిరాజు, లక్ష్మణ్ ఉన్నారు.