కుంటాల, డిసెంబర్ 24 : సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలం అందకూర్ గ్రామంలో దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి సామూహిక కల్యాణ మండపం, లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 33 లక్షలు మంజూరు కాగా శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం లో శిథిలావస్థకు చేరిన దేవాలయాలను స్వరాష్ట్రం లో సర్కారు దశల వారీగా అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం భారీగా నిధులు మంజూ రు చేస్తున్నదని తెలిపారు. ఆలయ కమిటీ, వీడీసీ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. స్థానిక సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీపీ గజ్జారాం, జడ్పీ టీసీ సభ్యురాలు కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఎంపీటీసీ దాసరి మధు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, బీఆర్ఎస్ కన్వీనర్ దత్తు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
విద్యాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మాంజ్రి గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి మన ఊరు మన బడిలో భాగంగా రూ. 42 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం లో పాలకులు నిర్లక్ష్యం వల్ల విద్యాభివృద్ధి జరుగలే దన్నారు. కుభీర్ మండల వాసులు ఎమ్మెల్యేను దేగాంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వబ్రా హ్మణ, నాయీబ్రాహ్మణ, రాజ్పుత్, ముదిరాజ్ల కుల సంఘాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎంఈవో సుభాష్, నాయకులు బామ్నిరాజన్న, ఆనంద్ రావు పాటిల్, పోతన్న, ఏఈ భార్గవ్, విశ్వనాథ్, దేవిదాస్, మేరాజ్, హన్మండ్లు, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరాజీ, సంతోష్, విజయ్, వైస్ ఎంపీపీ మొహినొద్దీన్, సాయినాథ్, సోమేరు ప్రసాద్, ఠాకూర్ దత్తు సింగ్, సూది రాజన్న, తదితరులు పాల్గొన్నారు.