ఆదిలాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. మున్సిపాలిటీలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బత్తల రాజ్‌కుమార్, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొండ్ర రాజ్‌కుమార్‌లు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుటుండగా అధికారులు పట్టుకున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో సిమెంటు రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన చెక్కుపై సంతకం చేయడానికి ఏవో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు.