హరీశ్‌రావు పర్యటన ప్రతిపక్షాలకు ట్రైలర్
రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
- మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
- జోరుగా బీఆర్ఎస్ ప్రచారం
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 29 : రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యటనలో బైక్ ర్యాలీ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నూతనోత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు.
ఆదివారం పట్టణంలోని న్యూ హౌజింగ్ బోర్డు కాలనీ జోన్ వన్‌లో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానికుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన అభివృద్ధి పనుల తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, రోడ్డు, డ్రైనేజీ ఇతరత్రా సౌకర్యాల కల్పనకు రూ.కోట్ల నిధులు వెచ్చించినట్లు పేర్కొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఐటీ టవర్ నిర్మాణాన్ని సైతం చేపడుతున్నామని వివరించారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయితే కాలనీ దశ మారుతుందని అన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పవన్ నాయక్, ఆవుల వెంకన్న, కలీం, ఇబ్బు, శరత్, కలీం, గణేశ్, చందర్, శ్రీకాంత్, మున్నీ, షీల, లక్ష్మి పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారం..
ఎదులాపురం, అక్టోబర్ 29 : ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా జోగు రామన్నను మరోసారి గెలిపించాలని వార్డు కౌన్సిలర్ భరత్ కుమార్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, రాంమందిర్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో భరోసా ఇస్తుందన్నారు. నూతన మ్యానిఫెస్టోను వివరించారు. సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు, రూ400కు వంట గ్యాస్, రైతు బీమా తరహలోనే సామన్య ప్రజలకు రూ.5 లక్షల బీమా, ఆరోగ్య శ్రీ కింద రూ.15లక్షల వరకు సహాయం వంటి పథకాలను వివరించారు. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ కారు గుర్తుకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఆయన వెంట వార్డు ఇన్చార్జి అనిల్ కాంబ్లే, నాయకులు సంతోష్ ,వెంకటి, నాగ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

