ఎదులాపురం, నవంబర్ 27 : మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకురావాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట ఆదివారం క్రాంతి గురు లాహుజీ సాల్వే జయంతి ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జయంతి నిర్వహించుకునేందుకు 8 గుంటల స్థలాన్ని ఇచ్చామన్నారు.
దివంగత డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే సమాజాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌లో చేపడుతున్న అంబేద్కర్ భవన నిర్మాణం 90 శాతం వరకు పూర్తయిందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం మహారాష్ట్ర నుంచి వచ్చిన వక్త్తలు పలు అంశాలపై చైత్యనపరిచారు. కార్యక్రమంలో క్రాంతివీర్ లాహుజీ సాల్వే రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ్ లాంబటిలే, మహారాష్ట్ర వక్తలు దిలీప్‌చౌదరి, కిరణ్ కుమార్ మన్నూరే, జిల్లా నాయకులు రాహుల్ కాంబ్లే, నర్సింగ్మోరే, సూర్యకాంత్, సాంబశివ్జాదవ్, అనిల్, రాజ్‌కుమార్, వసంత్, ప్రజలు పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 27 : క్రీడల్లో గెలుపోటములు సహజమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. మావలలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. యువత సన్మార్గంలో పయనించాలని సూచించారు. అనంతరం జోగు ఫౌండేషన్ తరఫున మొదటి బహుమతి రూ.30 వేలు రెండవ బహుమతి జడ్పీటీసీ నల్ల వనితారాజేశ్వర్ తరఫున రూ.15వేలు, మూడవ బహుమతి రూ.10వేలు సర్పంచ్ ప్రమీల అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పవన్‌నాయక్, నాయకులు నల్ల రాజేశ్వర్, ఏవన్, ఉమాకాంత్ రెడ్డి, అజీమ్, సుధీర్, సంతోష్, గంగన్న, ఫౌండేషన్ అధ్యక్షుడు నిఖిల్, సంతోష్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 27 : ఆటలతో గ్రామీణ ప్రాంత యువకులను ప్రోత్సహించేలా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.