ఎదులాపురం, నవంబర్ 26 : రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బస్టాండు ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యాంగ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో..
సంవిధాన్ బచావో..దేశ్ బచావో, బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అలాగే ఎస్సీ స్టడీ సర్కిల్ నెహ్రూ యువ కేంద్రంలో అభ్యర్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. నిర్వాహకులు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్, రిటైర్డ్ ప్రొఫెసర్ సల్ల విజయ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
బేలలో..
బేల, నవంబర్ 26 : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో, కళాశాలల్లో అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు వినోద్, సత్యం, కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్‌రావు, ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు, సర్పంచ్‌లు ఇంద్రశేఖర్, రాకేశ్, ఫైజుల్లాఖాన్, నాయకులు పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, నవంబర్ 26 : మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు భారత రాజ్యాంగ నమూనా వేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. సొనాల, బోథ్‌లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమాల్లో గజేందర్, మహేందర్, షేక్ నాజర్ అహ్మద్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌లో..
గుడిహత్నూర్, నవంబర్ 26 : మండల కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవ్ మస్కే, సర్పంచ్ జాదవ్ సునీత, న్యాయవాది ఆజయ్ జోందలే, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా నాయకుడు జాదవ్ రమేశ్, నాయకులు వినోద్, మాధవ్, కిషన్, విజయ్, భీం టైగర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఇచ్చోడ (సిరికొండ), నవంబర్ 26 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జన శిక్షణ సంస్థ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ వర్ని సంతోష్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరికొండ మండలం నేరడిగొండ(జీ) గ్రామంలో గ్రామ పెద్దలు, జన శిక్షణ సంస్థ టైలరింగ్ నేర్చుకునే మహిళలు యువతులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ కుమ్రం గణపతి రావ్ పటేల్, జన శిక్షణ సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ రాజు, సర్పంచ్ మహేశ్వరి, ఎంపీటీసీ అనసూయ, అంగన్వాడీ టీచర్ అనసూయ, ఉపాధ్యాయులు పూజ, సంగీత, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, నవంబర్ 26 : మండల కేంద్రంలో ఏజెన్సీ పరిరక్షణ కమిటీ, మాల సంఘం ఆధ్వర్యంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గణేశ్, ఉపాధ్యక్షుడు సిడాం మురళీకృష్ణ, ఎంపీటీసీ శివారెడ్డి, సిడాం లక్ష్మికాంతారావు పటేల్, కొడప నగేశ్, సిడాం సునీల్, జంగు, నాగేందర్, కిరణ్, మాల సంఘం అధ్యక్షుడు శాంతపూర్ రాజేశ్వర్, యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్, నవంబర్ 26 : మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ బాలాజీ అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీ(బీ)ఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, నాయకులు సతీశ్, హరీశ్, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
కళాశాలలో..
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పావని, అధ్యాపకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే అంబేద్కర్ చౌక్‌లోని విగ్రహానికి టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు ప్రజ్ఞశీల్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, నవంబర్ 26 : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోరెంగా గాంధారి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పుష్పలత, పార్టీల కార్యాలయాల్లో నాయకులు, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సోము ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఉపసర్పంచ్ గణేశ్టేహెరే, ఎంపీటీసీలు స్వర్ణలత, ఆశబాయి, ఈవో సంజీవరావ్, నాయకులు పాల్గొన్నారు.
నార్నూర్‌లో…
నార్నూర్, నవంబర్ 26 : మండల కేంద్రంతో పాటు కేజీబీవీ, సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, మాలమాహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశే ఖర్, దుర్గే కేశవ్, గుణవంత్‌రావ్, రుక్మాబాయి, కేజీబీవీ ప్రత్యేకాధికారి జాదవ్ కవిత, ప్రధానోపాధ్యాయుడు మిళింద్, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 26 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయమూర్తులు దమ్మపాల్, అజయ్ అన్నారు. మండల కేంద్రంలోని క్రిసెంట్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు భారత రక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, నవంబర్ 26 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శబానా తరన్నం, అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ బలరాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భీంపూర్‌లో..
భీంపూర్, నవంబర్ 26: మండలంలోని కరంజి(టీ), నిపాని, పిప్పల్‌కోటి, భీంపూర్‌లో వక్తలు రాజ్యాంగం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 26 : మండలంలోని కప్పర్ల, తాంసి, పొన్నారి, ఘోట్కూరి, వడ్డాడి, జామడి గ్రామాల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సదానందం, కృష్ణ, సంజీవ్‌రెడ్డి, కేశవ్‌రెడ్డి, భరత్, శ్రీనివాస్, ఎంపీటీసీలు సంతోష్, నరేశ్, రేఖ, నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌రూరల్, నవంబర్ 26 : మండలంలోని కేబీ కాంపెక్స్‌లోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, నాగాపూర్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీవాణి, అంబేద్కర్ సంఘం నాయకులు, సర్పంచ్ జాదవ్ సునీల్, ప్రిన్సిపాల్ సుమలత పాల్గొన్నారు.