బేల, డిసెంబర్ 7 : మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న చేప, రొయ్య పిల్లలను బుధవారం వదిలారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో 9 లక్షల 94 వేల చేప పిల్లలు, 4 లక్షల 95 వేల రొయ్య పిల్లలు వదిలామని తెలిపారు. వీటి విలువ రూ.8.50 లక్షలు ఉంటుందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీతో వలలు, బైకులు, మ్యాక్ పికప్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, నాయకులు భరత్, శ్యాం, మత్స్యకారులు పాల్గొన్నారు.