
పోస్టాఫీసుల్లో అవకాశం రూ. 50తో ప్రక్రియ పూర్తి
ఓటీపీ వస్తేనే ధాన్యం కొనుగోలు, పేమెంట్ సాధ్యం
మంచిర్యాల అర్బన్, నవంబర్ 30;తపాలాశాఖ కార్యాలయాల్లో రైతుల ఆధార్ నంబర్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసే అవకాశాన్ని పోస్టల్ శాఖ అధికారులు కల్పించారు. మంచిర్యాల జిల్లాలో 134 పోస్టాఫీ సులుండగా, 49 బ్రాంచ్‌లలో సిబ్బంది రైతులకు ఓటీపీ లింక్ చేసేందుకు అందుబాటు లో ఉన్నారు. రైతులు పోస్ట్‌మన్ వద్దకు ఆధార్, మొబైల్ ఫోన్‌తో వెళ్తే కేవలం రూ. 50 తీసుకొని రైతుల ఆధార్‌కు మొబైల్ నంబర్ని లింక్ చేస్తున్నారు. ఇది ధాన్యం కొనుగోళ్లకే కాకుండా అన్నింటికీ ఉపయోగపడనున్నది. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ ఆధార్ సెంటర్లలో కూడా చేసుకోవచ్చుకానీ.. గ్రామాల్లో పోస్ట్మెన్లు అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సేవలను ఉపయోగించుకోవచ్చు.
రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తేనే..
కొనుగోలు కేంద్రానికి రైతులు ఆరిన ధాన్యాన్ని తీసుకెళ్లగానే పీపీ సెంటర్ ఇన్చార్జిలు ట్యాబ్‌లలోని ఓపీఎంఎస్ యాప్‌లో రైతు ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. వెంటనే రైతు ఆధార్ కార్డుకు లింకు ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. ఆ నంబర్ యాప్‌లో నమో దు చేస్తేనే రైతు భూమి, బ్యాంకు వివరాలతో పాటు మిగితా సమాచారం కనిపిస్తుంది. అప్పుడే కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు, ధాన్యం రకం నమోదు చేస్తారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ లేనట్లయితే యాప్‌లో ఇవేమీ నమోదు చేయడం కుదరదు కాబట్టి సివిల్ సప్లయ్ అధికారులు ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని ముందునుంచి సూచిస్తున్నారు.
49 మంది అందుబాటులో..
జిల్లాలోని పోస్టాఫీసుల్లో ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసేందుకు 49 మంది అందుబాటులో ఉన్నారు. ద్వారక తపాలాశాఖలో రమ్య, మధూకర్, బూదాకలాన్లో శ్రీనివాస్, చెన్నూర్‌లో మహేశ్, మధుబాల, మిట్టపల్లిలో దిలీప్‌రావు, సిర్సాలో పుల్లా, జజ్జర్వెల్లిలో పవన్, బాదంపల్లిలో రాజేందర్, ఆస్నాద్‌లో జగన్ మోహన్‌రావు, రేపల్లెవాడలో రాజేశ్, కల్యాణిఖనిలో సత్యనారాయణ, మెట్పల్లిలో సాయికిరణ్, పార్‌పల్లిలో అహ్మద్ ఖాజా, పెర్కపల్లిలో కుమారస్వామి, వేలాలలో శంకర్, నాగాపూర్‌లో స్వప్న, ఇందారంలో శైలజ, ఖర్జీభీంపూర్లో భరత్ కుమార్, మేదరిపేటలో లక్ష్మయ్య, కిష్టంపేటలో శ్రీనివాస్ రెడ్డి, వీగాంలో రాధాకిషన్‌రావు, అన్నారంలో సందీప్, శాంతిఖనిలో సలీం, వెంకట్రావుపేటలో మల్లయ్య, పౌనూరులో రాజమల్లా గౌడ్, జైపూర్‌లో వొజ్జల సాయిబాబా, బెల్లంపల్లిలో గొర్ల పోషమల్లు, పోతరాజు బాబురావు, సీసీసీలో అజీం పా షా, ఉడుంపూర్లో జ్ఞానేందర్, దేవులవాడలో జానకి, పొ న్కల్లో శ్రీనివాస్, అంగ్రాజుపల్లిలో రాజన్న, సింగపూర్‌లో అలేఖ్య, సుద్దాలలో అఖిల్, కిష్టాపూర్‌లో సాయి మనోహర్, టేకుమట్లలో రమాదేవి, నశీరాబాద్లో జయరాజు, పాత మంచిర్యాలలో సాయి ప్రసాద్, జన్కాపూర్‌లో మనీషారాణి, కాసిపేటలో రాజేశ్వర్ రెడ్డి, మంచిర్యాలలో రమావత్ దుల్యా, పెగడపల్లిలో మమత, చందారంలో రమేశ్, అచ్చులాపూర్‌లో కల్పన, భీమినిలో నాగేశ్వర్ రావు, చింతగూడలో సాయిజ్ఞాన్ అందుబాటులో ఉన్నారు.
రైతులకు అందుబాటులో సిబ్బంది
జిల్లాలోని అన్ని పోస్టాఫీసుల్లో ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను అనుసంధా నం చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లోని రైతులు పోస్ట్‌మన్‌కు ఫోన్ చేస్తే వారి ఇంటికే వెళ్లి రూ. 50 తీసుకొని మొబైల్ నంబర్ అప్డేట్ చేసి వెళ్తారు. మొబైల్ లింక్ లేకుంటే ధాన్యం విక్రయిం చినా ఆ వివరాలు యాప్‌లో నమోదు చేసే వీలుండదు కాబట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. పోస్టల్ శాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులే కాకుండా విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరి ఆధార్ కార్డులకు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.