రెబ్బెన, మార్చి 13 : రెబ్బెన మండల కేంద్రంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి రెబ్బెన మండలశాఖ, బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షురాలు, బీఆర్ఎస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, రెబ్బెన మాజీ సర్పంచ్ బోమ్మినేని అహల్యాదేవి, బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు పూలకండం వరలక్ష్మి, నాయకులు దారిశేట్టి శారద, తీపుల సువర్ణ, పల్లి రజిత, పల్లె శ్రీదేవి ఉన్నారు.