బెజ్జూర్, ఏప్రిల్ 21 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ దండె విఠల్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కోరారు. ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలోని వారసంతలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వ్యాపారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. హోటళ్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ సర్కారులో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆయా వర్గాలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సోయం చిన్నయ్య, సామల రాజన్న, మేర్గు రమేశ్, తేలి రాజేశ్, డబ్బ తిరుపతి, జంగిటి మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.