తాంసి, నవంబర్ 15 : రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకునే దొంగ, అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌కు పాలించే హక్కు లేదని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని డాక్టర్ వన్నెల అశోక్ స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వన్నెల అశోక్‌తో పాటు అతని అనుచరులు ఆయా మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు యువ నాయకులు వెయ్యి మందిపైగా బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు జాదవ్ అనిల్, జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ 20 మంది ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి తనను గెలిపిస్తుందని అన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ధర్మంగా పని చేసేవారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అలీబాబా అరడజను దొంగల ముఠా అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలని వారిని నమ్మి ఓటు వేస్తే రాష్ర్టాన్ని అమ్మేస్తారని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో
కాంగ్రెస్‌ను నమ్మిన కార్యకర్తలను నట్టేల ముంచిన పార్టీ కాంగ్రెస్ అని డాక్టర్ వన్నెల అశోక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్టీ, ప్రజల కోసం కాకుండా డబ్బులు, కమీషన్ల కోసం మాత్రమే పని చేస్తాడని అన్నారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీ సర్పంచ్‌లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భీంపూర్ మండలంలోని కరన్వాడి సర్పంచ్ వినోద్, కైదిగూడ సర్పంచ్ గోవిందరావ్, తుడుందెబ్బ మండలాధ్యక్షుడు ఆత్రం భరత్, మాజీఎంపీపీ, ఎంపీటీసీ వన్నెల నరేశ్, బద్ధం వినోద్ రెడ్డి, సిరిగిరి లక్ష్మిపతి, రాజాబ్ అలీ, ఉత్తమ్వాడ్గోరే,
వామన్ రెడ్డి, గూడ అనిల్, బాబుఖాన్, రామన్న, సిరికొండ లక్ష్మణ్, శ్యాంసుందర్, నారాయణ, శ్రీనివాస్, జైతు పటేల్ ముఖ్యనాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేశ్, సర్పంచ్‌లు స్వప్నారత్నప్రకాశ్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, జ్యోతి నర్సింగ్, కుంట సరిత-కేశవ్ రెడ్డి, మునేశ్వర్ భరత్, ఎంపీటీసీ అశోక్, బీఆర్ఎస్ నాయకులు ఏల్చల దత్తాత్రేయ, రజినీకాంత్ రెడ్డి, రవికాంత్, గోవర్ధన్ రెడ్డి, కీర్తి అరుణ్‌కుమార్, కాంత్‌రెడ్డి, నారాయణ, మహేందర్, సిరిగిరి దేవేందర్, వెంకట రమణ, రాంచందర్ రెడ్డి, మల్లయ్య, చంద్రయ్య, ముచ్చ రఘు, తదితరులు పాల్గొన్నారు.