బాసర, అక్టోబరు 8 : మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ప్రచార రథాన్ని ప్రారంభించారు. బాసరలోని రైల్వేస్టేషన్ వద్ద గల శివాజీ చౌక్ నుంచి భారీ ర్యాలీగా అమ్మవారిని ఆలయం వద్దకు పార్టీ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతున్నదన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహాకారంతో ముథోల్ తాలుకాను అభివృద్ధి చేశానని మరోసారి అవకాశం కల్పించా లని కోరారు. ఇంటింటికి సంక్షేమ పథకాన్ని అందజేస్తున్న ప్ర భుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రజలు మరోసారి తమను ఆశిర్వదించాలని కోరారు. బాసరకు చేరుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని నాయకులు డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బీటీరోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నూతన దేవాలయాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈయన వెంట సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు సుధా కర్‌రెడ్డి, బాసర సర్పంచ్ లక్ష్మణరావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ రమేశ్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్‌రావు, బీఆర్ఎస్ యువ నాయకులు కార్తీక్ రావు, జ్ఙానిపటేల్, నరేశ్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దోడాపూర్లో..
బాసర, అక్టోబరు 8 : మండలంలోని దోడా పూర్లో ఆదివారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదే విధంగా ఎమ్మెల్యే సమక్షంలో సుమారు 20 మంది వరకు గ్రామస్తులు బీజేపీ నుంచి బీఆర్ ఎస్‌లోకి చేరగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో సర్పంచ్ విద్యా దీపక్, ఎంపీటీసీ దిగంబర్, ఉపసర్పంచ్ సంతో ష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేశ్, సంతోష్‌పాటిల్, వార్డు మెంబర్లు ఉన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
లోకేశ్వరం, అక్టోబర్, 8: లోకేశ్వరం మండలంలోని గడ్‌చాంద గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ సాయన్న, మాజీ సర్పంచ్ గంగన్నలు బీజేపీ నుంచి ఆదివారం బీఆర్ఎస్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సర్పంచ్‌లు వెంకట్ రావు, భుజంగ్‌రావు పటేల్, దార్వాడి కపిల్ భీంరావు పటేల్, మాజీ ఎంపీపీ సాగర్, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, ప్యాట సుధాకర్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.