భీంపూర్, ఫిబ్రవరి 25 : తెలంగాణ రాష్ట్ర ప్రగతి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశ భవిష్యత్‌కు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ తాటిపెల్లి రాజుతో కలిసి శనివారం తాంసి తహసీల్ కార్యాలయంలో 13 మందికి రూ.13,01,508 విలువైన కల్యాణ లక్ష్మి, మరో 13 మందికి రూ.3,61,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రెడ్డి సంఘం భవనం కోసం భూమిపూజ చేశారు. నాగేశ్వర ఆలయంలో పూజలు చేశారు. రూ.3.38 కోట్ల అంచనాతో నిర్మాణమవుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు.
ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రగతిలో నియోజకవర్గం ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేని శక్తులు ఏమి మాట్లాడినా రాష్ట్రంలో మళ్లీ విజయదుందుభి మోగించేది బీఆర్ఎస్ అని గుర్తు చేశా రు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీ పీ మంజుల, వైస్ ఎంపీపీ రేఖ, సర్పంచులు స్వప్న, వెంకన్న, సంజీవ్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అరుణ్, ప్రధాన కార్యదర్శి రమ ణ, నాయకులు సురుకుంటి శ్రీధర్ రెడ్డి, కృష్ణ, గంగారాం, రఘు, మహేందర్ పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
తలమడుగు, ఫిబ్రవరి 25 : మండలంలోని భరంపూర్ గుట్టపై ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను ఆల య కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెలమ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శాస్త్రి, కిరణ్, అబ్దుల్లా, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.