ఎదులాపురం,డిసెంబర్10: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య ఖర్చులకు రూ.10లక్ష వరకు పెంచారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్స్పెషాలీటిలో ఆరోగ్యశ్రీ వైద్య సహాయం, మహిళాలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం(మహాలక్ష్మి)పథకాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఏర్పాటు చేసిన సమా వేశం లో ఆరోగ్యశ్రీ పథకం, మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం చేసిన వారి ఇచ్చే జీరో టికెట్ పోస్టులను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్,
డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, అర్టీసీ ఆర్ఎం సోలెమాన్,డీఎం కల్పనలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ,మహాలక్ష్మీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో వైద్యులు, ఇతర పరికరాలు ,యంత్రాలు ఎన్ని అవసరమో రాష్ట్ర ప్రభుత్వంతో, మంత్రులతో మాట్లాడి తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు.
అనంతరం బస్సులో విద్యార్థులు, మహిళాలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మావల చౌరస్తా,తిరిగి కలెక్టర్ చౌక్ నుంచి దవాఖాన వరకు ఎమ్మెల్యే ప్రయాణం చేశారు. ప్రయాణ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు జీరో చార్జీ టికెట్‌ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వివేకనంద రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ ఇద్రిస్అక్బనీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, వార్డు కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్ కుమార్, జోగు రావి, కృష్ణాయాదవ్, నాయకులు భీంసేన్ రెడ్డి, చిక్కాల దత్తు,సతీశ్, తదితరులు ఉన్నారు.