ఆసిఫాబాద్, జనవరి7 : ఉపాధ్యాయులంతా విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం తన నివాసంలో టీయూటీఎఫ్ సంఘం-2024 క్యాటెండర్ను ఆమె ఆవిష్కరించారు. సిర్పూర్(యు), లింగాపూర్, జైనూర్ మండలాలకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర బిల్లుల మంజూరులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జైనూర్ కేంద్రంగా ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల సదాశివ్ కోరారు.
అనంతరం కోవ లక్ష్మిని నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు గెడం జనార్దన్, ఆర్థిక కార్యదర్శి వెంకట్రావ్, నాయకులు ప్రకాష్, శ్రీనివాస్, రవీందర్, రవి, మధు, ధన్‌రాజ్, ఉపాధ్యాయులు కేశవ్, శంకర్రావు, విద్యాసాగర్, నాగేశ్, రామకృష్ణ, రమేశ్, సుభాష్, ప్రవీణ్, మహేశ్వరరావ్, హన్మంత్‌రావు, సత్యనారాయణ, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.