ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 28 : ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు మరింత చొరవ చూపాలన్నారు. లక్షల్లో ఖర్చుపెడితే వేళల్లో ప్రభుత్వం మంజూరు చేయడం దారుణమని పేరొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలని పేరొన్నారు.
ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకున్న బిల్లులపై కనీసం 70 శాతం అయినా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, కర్నాదం సంజీవ్, పార్టీ మండల అధ్యక్షుడు జాబరే రవీందర్, మాజీ జడ్పీటీసీ అజయ్, మాజీ ఎంపీపీ సౌందర్య, ఏఏసీ మాజీ చైర్మన్ వనజా, మాజీ సర్పంచులు బుసి భీమేశ్, శ్రీనివాస్, కిష్టయ్య, అయ్యూబ్ ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
రెబ్బెన, జూలై 28 : గంగాపూర్ గ్రామానికి చెందిన అదే సాగర్, మాదని జైరాం, గుర్లే రాంబాయికు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అందించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, మాజీ ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, మాజీ ఎంపీటీసీ సంగం శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ పర్లపల్లి వనజ, బీఆర్ఎస్ నాయకులు పందిర్ల మధునయ్య, జుమ్మిడి ఆనందరావు ఉన్నారు.