ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25 : పూలాజీ బాబా బాటలో నడవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం లో ఈ నెల 27,28న సద్గురు పూలాజీ బాబా ధ్యానకేంద్రం 10వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, అందుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు ఎందరో గురువులు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రవీందర్, నాయకులు శ్యాంరావు, నారా ఆశన్న, రోజా, రాజు, అశోక్, కాశీనాథ్, శంకర్, పెంటు, రాందాస్ పాల్గొన్నారు.