తిర్యాణి, జనవరి 18 : ఈ నెల 29న గడలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డోంగుర్గాంలోగల నా గేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించే పూజా మహోత్సవాల కరపత్రాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గడలపల్లి సర్పంచ్ మడావి గుణవంతరావ్ గురువారం విడుదల చేశా రు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోయం కట్టి, నిర్వాహకులు సిడాం శేఖర్, వేలాది రాజు, వేలాది మారుతి, సిడాం బాలు పాల్గొన్నారు.