ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 6 : ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవలక్ష్మి పుట్టిన రోజు వేడుక లు గురువారం ఘనంగా నిర్వహించారు. జి ల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కోవ లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్ర త్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు మధుకర్ శర్మ, ప్రశాంత్ శర్మ ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం తన నివా సం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అభిమానులు, నాయకులు కా ర్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, జీఎం శ్రీనివా స్ తరలివచ్చి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ దవాఖానలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రో గులకు పండ్లు పంపిణీ చేశారు. వినోద్ జ స్వాల్, ఎండీ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హై మద్, మండల అధ్యక్షుడు జాబరే రవీందర్, నాయకులు అన్సార్, నిసర్, హైమద్, రవి, హైమద్, ఖాసిం, కార్యకర్తలు పాల్గొన్నారు.