తలమడుగు, అక్టోబర్ 6 : బీఆర్ఎస్కే మా మద్ద తు అంటూ మండలంలోని అర్లి(కే) గ్రామస్తులు శుక్రవారం తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామస్తులు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో దాదాపు 200 మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరారు. ఒకే పార్టీ ఒకే గ్రామం అనే నినాదంతో తమ గ్రామంలో కొంత అభివృద్ధి జరగకపోయిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌పై నమ్మకంతో గ్రామస్తులంతా కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని నిర్ణయించుకున్నామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రజలంతా గ్రామం అభివృద్ధి చెం దాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్కు ఓటు వేస్తామని తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ నిచ్చారు. అంతకుముందు వారు బరంపూర్ నుంచి గ్రామం వరకు 300 బైక్‌లతో ర్యా లీగా గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు మంగళహారతులతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. బోథ్ ఎమ్మె ల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనిల్ జాదవ్ ఎమ్మెల్యే నామినేషన్ ఖర్చు కూడా తామే భరిస్తామని యువకులు జిల్లా అధ్యక్షుడికి తెలిపారు. గ్రామంలో రామాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన మైస మోహన్ తనకున్న మూడెకరాల్లో అరెకరం భూమిని రామాలయం నిర్మాణానికి దానం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఎస్డీడీసీ మాజీ చైర్మ న్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట వెంకటేశ్, సర్పంచ్ నారు కిష్టన్న, నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆనంద్, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణ, రాజు పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 6 : కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలకేంద్రంలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న మరాఠ సంఘం భవనం పనులను మండల నాయకులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం బేల మార్కెట్ యార్డు నుంచి ట్రాక్టర్లతో డీజే పాటల నడుమ భారీ ర్యాలీ తీశారు. అలాగే ప్రైవేట్ గార్డెన్లో యువకులకు స్పోర్ట్స్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలవ్యాప్తంగా 66 కిట్లు పంపిణీ చేశామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే మండలంలోని ప్రభుత్వ స్థలంలో దాదాపు రూ. 5 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం చేపడుతామ హామీనిచ్చారు. అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు మరాఠ సంఘం ఆధ్వర్వంలో పూలమాల వేసి శాలువా , మెమోంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్‌పవార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్యాం ప్రమోద్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవన్న, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, తన్వీర్‌ఖాన్, జక్కుల మధూకర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.