ఎదులాపురం, మార్చి 12 : పార్లమెంట్లో దైవ సాక్షిగా ప్రమాణం చేసి గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1200 వరకు పెంచారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ బడాల సుజాత, యువ నాయకుడు బడాల సృజన్ రెడ్డితో పాటు 200 మంది యువకులు బీఆర్ఎస్ లో ఆదివారం చేరారు. ఈ మేరకు వారికి స్థానిక ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మొదట ఎమ్మెల్యే జోగు రామన్నకు సంజయ్ నగర్ కాలనీ వాసులు స్వాగతం పలికారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రోకండ్ల రమేశ్, మెట్టు ప్రహ్లాద్, పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, కౌన్సిలర్లు, భరత్, పవన్‌నాయక్, అవుల వెంక న్న, బండారి సతీశ్, నాయకులు రాంకుమార్, శైలేందర్, జోగు మహేందర్ ఉన్నారు.