జైనథ్, జూలై 9 : కవులు, రచయితలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జైనథ్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఆవరణలో ప్రముఖ కవి చిందం ఆశన్న రచించిన స్వామి వారి శతకం పద్యకావ్యాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కవులను వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కవి చిందం ఆశన్న సాహితీ రంగంలో మరింతగా రాణించాలన్నారు. జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, కోనేరును అభివృద్ధి చేస్తామన్నారు.
జైనథ్‌ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అవసరమైతే సొంతంగా కూడా వ్యయం భరిస్తామన్నారు. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కవులు, కళాకారులను శాలువాలతో సన్మానించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు బాలసాని నారాయణ గౌడ్, తెరవే రాష్ట్ర సభ్యుడు డాక్టర్ ఉదారి నారాయణ, ప్రముఖ కవులు సామల రాజవర్ధన్ ,మురళీధర్, రంగాచార్య , చరణ్‌దాస్, రమేశ్, ఎంపీపీ గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వేణుయాదవ్, సర్పంచ్ దేవన్న, నాయకులు చంద్రయ్య, గణేశ్‌యాదవ్, వెంకట్‌రెడ్డి ,లస్మన్న, భక్తులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ
ఎదులాపురం, జూలై 9 : ఆదిలాబాద్‌లోని కలెక్టర్‌చౌక్‌లో సోమవారం కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆదివాసుల సంప్రదాయం ప్రకారం కుమ్రం భీం మనువడు సొనేరావ్, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి పూజలు చేశారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర లక్ష్మీరాజు, వైస్‌ఎంపీపీ కుమ్ర జంగు పటేల్, ఎంపీటీసీ జంగుబాబు, కుమ్ర పరమేశ్వర్, సర్పంచ్‌లు రాంచందర్, మాధవ్, తానాజీ, కుమ్ర రాజుపటేల్, కుమ్ర శ్రీనివాస్, కుమ్ర జయంతి, తదితరులు పాల్గొన్నారు.