బెజ్జూర్, ఫిబ్రవరి 1 : చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, రైతులకు మేలు జరుగుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు అన్నారు. మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కుకుడ, కుశ్నపల్లి వాగులపై చెక్‌డ్యాం పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఎల్కపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలానికి 5 చెక్ డ్యాంలు మంజూరు కాగా, రెండింటి పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ రెండు చెక్ డ్యాంల ద్వారా 100 ఎకరాల చొప్పున పంటలు సాగయ్యే అవకాశం ఉందన్నారు. కుశ్నపల్లి నుంచి గూడెం వరకు మెరుగైన రవాణా సౌకార్యం కల్పిస్తామన్నారు. బెజ్జూర్ శివారులోని 761, 762 సర్వే నంబర్లలో సుమారు 300 ఎకరాల్లో సాగు చేస్తున్న ఎల్కపల్లి, సిద్దాపూర్ గ్రామాల చెందిన రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. చిన్నసిద్ధాపూర్లోని హనుమాన్ ఆలయంలో బోర్వెల్కు భూమి పూజ చేశారు. పాల్వాయి పురుషోత్తం రావు స్మారక క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పంద్రం పుష్పలత, ఎంపీటీసీలు సాయి, పర్వీన్ సుల్తానా, మాజీ ఎంపీపీలు కోండ్ర మనోహర్ గౌడ్, కొప్పుల శంకర్, ఐకేపీ జిల్లా అధ్యక్షురాలు పొర్షెటి శ్రీదేవి, ఈఈ ప్రభాకర్, డీఈ భద్రయ్య, ఏఈ అయాజ్ కుమార్, రైల్వే బోర్డు సభ్యుడు ధోని శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఎలాంది నారాయణ, నాయకులు భాస్కర్ రాజు, వసీఖాన్, ఉమ్మెర బాలకృష్ణ, మెస్రం రాజారాం, నేరెళ్ల సంతోష్, గడ్డం రాజేశ్, కిషన్ గోపాల్ యాదవ్, తాళ్ల రామయ్య, చప్పిడి సత్యనారాయణ, జాడి డిగంబర్ తదితరులున్నారు.
కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 1: రైతులు కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు సూచించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నాఫెడ్ తరఫున మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ ఇన్చార్జి చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చీపిరిశెట్టి శంకర్, పీఏసీఎస్ డైరెక్టర్ ధర్ని రామయ్య, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, బీజేపీ పట్టణాధ్యక్షుడు సిందం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్, దెబ్బటి శ్రీనివాస్, మహిళా పట్టణాధ్యక్షురాలు చిప్ప మౌనిక, మార్కెట్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.