కుంటాల, నవంబర్ 19 : రాష్ట్రంలోని ఇంటింటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి జరుగుతున్నదని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ప్రజలను కోరారు. కుంటాల మండలంలోని లింబా (బీ), లింబా (కే), మెదన్పూర్, ఓలా, దౌనెల్లిలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయ్యాలని, కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు.
మ్యానిఫెస్టోలో పొందుపర్చిన రైతుబంధు పెంపు, ఆసరా పింఛన్ల పెంపు, రూ.400కే వంట గ్యాస్, సౌభాగ్యలక్ష్మి పథకంలో భాగంగా బీపీఎల్ కుటుంబాల మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి, రేషన్ కార్డుపై సన్నబియ్యం, కుటుంబానికి రూ.5 లక్షల కేసీఆర్ బీమా, కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో అర్హులైన పౌరులందరికీ, జర్నలిస్టులకు రూ.15 లక్షలతో ఆరోగ్య శ్రీ బీమా తదితర పథకాల గురించి ఓటర్లకు వివరించారు. గడప గడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
పార్టీ అధికారంలోకి వస్తే పెరిగే ఆసరా పింఛన్ల గురించి వివరించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టో వట్టి నీటిముటలని, ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకలో పట్టిన దుస్థితి పడుతుందని పేర్కొన్నారు. బీజేపీ అసత్య ప్రచారాలకు యువత మోసపోవద్దని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారని, అలాగే పేదలు అనారోగ్యంతో ఆసుపత్రిపాలైతే ముఖ్యమంత్రి సహాయనిధి కింద సాయం అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే అర్హులైనవారికి గృహలక్ష్మి, దళితబంధు పథకాలు వర్తింపజేశామని, గెలిచిన తర్వాత దశలవారీగా అర్హులైన ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.
ఓలా గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మ్యానిఫెస్టోలో పొందుపర్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, సర్పంచ్ ఖనీష్ ఫాతిమా, సర్పంచ్ ఆనంద్ రావు, సర్పంచ్ మల్లేశ్, సర్పంచ్ అహ్మద్, ఆత్మ మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి, ఎంపీటీసీ సునంద గిరీశ్, పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దశరథ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖదీర్, పార్టీ నర్సాపూర్ (జీ) మండల కన్వీనర్ పాపెన్ రాజేశ్వర్, భోగ లక్ష్మణ్, లక్ష్మీ రమేశ్, గుద్దేటి కిష్టయ్య, చంద్రకాంత్, రమణ గౌడ్, హైమద్ పాషా, దొనికెన వెంకటేశ్, అహ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొంతల పోశెట్టి, గైని సాయికుమార్, సదాశివ్ పటేల్, శ్రీనివాస్ గౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మనోహర్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పెద్దింటి పోశెట్టి, ఇంద్రారెడ్డి, రమేశ్, ఉమ్రి శ్రీధర్, శివ కుమార్, సబ్బిడి గజేందర్, రాకేశ్, శ్రీకర్ రెడ్డి, గోనె గజ్జారాం, సుదర్శన్ రెడ్డి, సంతోష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, నవంబర్ 19 : మండలంలోని పార్డి(బీ) గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, నాయకులు శేరి సురేశ్, బాబు, గంగయ్య అధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పథకాలు, ఇంటింటా వర్తించిన పథకాలు, ఆసరా పింఛన్లు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, రైతు బంధు, బీమా వర్తించిందా అంటూ మరో మారు లబ్ధిదారులకు గుర్తుచేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు కావడం లేదని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి, ముథోల్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్రెడ్డిని మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
భైంసాటౌన్, నవంబర్ 19 : ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనుక సీఎం కేసీఆర్ కృషి గణనీయంగా ఉందని మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి అన్నారు. మండలంలోని వాటోలిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి రాష్ట్రం చేరుకున్నదన్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఉన్నదన్నారు. గ్రామంలో కోత పూర్తి చేసుకొని ఆరబెట్టిన వడ్లను చూసి పెట్టుబడి సాయం, నిరంతర ఉచిత విద్యుత్ వల్లే వర్షాభావంలోనూ పంటలు పండుతున్నాయని అన్నారు. మండల నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి, కారు గుర్తుకు ఓటు వేసి విఠల్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ నిఖిత పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్, సర్పంచ్లు ప్రసాద్ పటేల్, బొబ్బిలి శ్రీనివాస్, ఎంపీటీసీ నర్సారెడ్డి, మాణిక్ పటేల్, నాయకులు రాంకుమార్, కో-ఆప్షన్ సభ్యుడు గజానంద్, రాందాస్, మహేశ్, రావుల పోశెట్టి పాల్గొన్నారు.
భైంసా, నవంబర్ 19 : బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే ముథోల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పట్టణంలోని బోయిగల్లి, మార్కెట్ ఏరియాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి, కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళిగౌడ్, విలాస్ గాదేవార్, రమేశ్ మాశెట్టివార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము, భోజరాం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.