ఆదిలాబాద్ : పట్టణంలోని చాంద గ్రౌండ్లో జోగు బోజమ్మ, ఆశన్న జ్ఞాపకార్తం జోగు ఫౌండేషన్ తరపున మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ (MLA Anil Jadhav) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి బ్యాట్బాల్ చేతపట్టి తన క్రీడా స్ఫూర్తిని చాటారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ జోగు రామన్న క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ మంత్రి రామన్న స్ఫూర్తితో బోథ్ నియోజకవర్గంలో తాను కూడా క్రీడలను ప్రోత్సహిస్తున్నానని అన్నారు. ఆదిలాబాద్ సీనియర్ క్రీడాకారుడు హిమ తేజ బీసీసీఐ క్రికెట్ స్థాయి వరకు చేరుకోవడం గర్వకారణమన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలల్ అజయ్, యూనిస్ అక్బర్, మెట్టు ప్రహ్లాద్ నారాయణ, సాజిత్ ఉద్దీన్, బట్టు సతీష్, శివకుమార్, అబ్దుల్లా, ఉగ్గే విట్టల్, అయూబ్, తదితరులు పాల్గొన్నారు.