బోథ్, మే 4 : జొన్న పంట విక్రయించేందుకు వచ్చే రైతులకు అధికారులు పూర్తి సహకారం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం సోనాల మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు జొన్నలను మధ్య దళారులను అమ్ముకోకుండా నేరుగా కేంద్రానికి తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3371 పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ అధికారి ప్రేమ్‌సింగ్, పీఏసీఎస్ చైర్మన్ కె.ప్రశాంత్, సీఈవో గోలి స్వామి, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు కె.రాజేశ్వర్, రాజు యాదవ్, పోశెట్టి, మనోహర్ పాల్గొన్నారు.