ఆదిలాబాద్ : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం బోథ్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి కార్యకర్తలు నాయకులు, సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని, గ్రామాల్లో గులాబీజెండాను ఎగురేయాలని సూచించారు.
15 నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని విమర్శించారు. రైతులతోపాటు అన్ని వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.