బజార్ హత్నూర్ : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు మేరకు బుధవారం బజార్ హత్నూర్ మండల మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్, బజార్ హత్నూర్ మాజీ సర్పంచ్ సాయన్న, చందు నాయక్ తాండ సర్పంచ్ కవిందర్లను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్రమ అరెస్టులు చేయడం తప్ప.. ప్రజల సంక్షేమం కోసం పని చేయడం చేతకాదని విమర్శించారు.