బేల, జూలై 12 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బావ మండలంలోని చాప్రల గ్రామానికి చెందిన యాసం నర్సింగ్ ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సింగ్ చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జోగు రామన్నతో మాట్లాడి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆయన వెంట నిర్మల్ మాజీ జడ్పీ చైర్మన్ రాంకిషన్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు తుల శ్రీనివాస్, తిరుమల్ గౌడ్, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, శ్రీధర్‌రెడ్డి, నాయకులు కేదారేశ్వర్‌రెడ్డి, బోథ్ పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి ఉన్నారు.