లక్ష్మణచాంద : వేసవిలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతుంటే మరోవైపు మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మల్లాపూర్ ( Mallapur ) ధర్మారం ప్రధాన రహదారిపై మల్లాపూర్ సమీపంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మిషన్ భగీరథ పైపులైను గత పక్షం రోజుల క్రితం పగిలిపోయింది .
దాదాపు 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పోవడం వల్ల గ్రామానికి తాగునీరు అందడం లేదని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై వెళ్తున్న వాహన చోదకులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికార యంత్రం స్పందించి పైప్లైన్ పగిలి చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని మల్లాపూర్ గ్రామస్థులు కోరుతున్నారు.