నిర్మల్ టౌన్, ఆగస్టు 22: రైతులకు నష్టం కలిగించే మాస్టార్ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీనిచ్చారు. నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మాస్టార్ప్లాన్ ఔటర్ రింగ్ రోడ్డు రద్దు చేయాలని కోరుతూ రైతులు వారం రోజులుగా నిర్మ ల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షాశిబిరాన్ని సందర్శించిన మంత్రి మంగళవారం రైతులతో మాట్లాడి దీక్షను విరమింపజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తన హయంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుట్రలు చేసి ఔటర్ రింగ్ రోడ్డు మాస్టార్ ప్లాన్ పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులు, ప్రజాభిప్రాయం మేరకే మాస్టార్ ప్లాన్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు.
రైతులు మాస్టార్ ప్లాన్ రోడ్డు నిర్మాణంపై అపోహలు వీడి, వాస్తవాలు తెలుసుకోవాలని, రాజకీయ పార్టీల కుట్రలో పడి ఆగం కావద్దని సూచించారు. మాస్టార్ ప్లాన్ విషయంలో బీజేపీ నాయకులు దొంగ దీక్షలు చేపట్టారని ఆరోపించారు. ఉనికిని కోల్పోతామని భావించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిర్మల్‌లో మాస్టార్ ప్లాన్‌పై రాజకీయాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే నెలలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇక్కడి అభివృద్ధిపై చర్చించి అందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేసి అందరి ఆమోదం మేరకే ముందుకెళ్తామని, రైతులు స్వచ్ఛందంగా దీక్షను విరమించాలని కోరారు. అయితే తమ దీక్షకు ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని రైతులు సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దీక్ష చేస్తున్న 22 మంది రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీధర్, మండల మాజీ ఉపాధ్యక్షుడు పోశెట్టి, బీఆర్ఎస్ నాయకులు కోటగిరి అశోక్, పద్మకర్, ఎస్పీ రాజు, శనిగార పు నరేశ్, ధర్మాజీ రాజేందర్, ధర్మాజీ శ్రీనివాస్, గోపి, నరేందర్, బి ట్లింగ్ నవీన్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
ప్రభుత్వ భూములు అక్రమించుకున్నానని, కాంగ్రెస్, బీజేపీ నాయకు లు ఆరోపిస్తున్నారని, నిరూపిస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటానని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సవాల్ విసిరారు. జిల్లాలో 260 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నానని ఇటీవల ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత ఆరోపణలు చేశాడని, ఎక్కడ ఆక్రమంచానో వివరాలతో సహా మీడియా ఎదుట ప్రజల సమక్షంలో బయటపెట్టాలని సవాల్ విసిరారు. లేకుంటే తప్పయ్యిందని ముక్కు నేలకు రాయాలని హితవుపలికారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతిగా, ని జాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నానని, అసత్య ప్రచారం చేస్తే ప్రజలే ఆ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొనారు.
రెండో ఏఎన్ఎంలను ఆదుకుంటాం..
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో చౌరస్తా వద్ద వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలు పది రోజులుగా చేస్తున్న సమ్మె శిబిరాన్ని మంత్రి సందర్శించి మంగళవారం సంఘీభావం తెలిపారు. న్యా యం చేస్తామని హామీనిచ్చారు. మంత్రి హామీతో వారు సంతోషం వ్య క్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు.