తెలంగాణలో ఆలయాలకు పునర్వైభవం
తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వరస్వామి,
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
సోన్, మార్చి 10 : తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వరస్వామి, లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాల్లో విగ్రహా ప్రతిష్ఠా పన కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజర య్యారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.
తెలంగాణ వచ్చాక అన్ని గ్రామాల్లో ఆలయాలను పునర్నిర్మించడం వల్ల అధ్యాత్మిక వాతావరణం పెరిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు దేవాదాయ శాఖను అప్పగించడం. ఆలయాలకు నిధులు మంజూరు చేయడం సంతో షంగా ఉందన్నారు. నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, సర్పంచ్ భూమేశ్, మహేశ్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం
నిర్మల్ టౌన్, మార్చి 10 : అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శనకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని దళిత సంఘాల ఆధ్వర్యంలో శాలువాతో సత్క రించి జ్ఞాపిక అందించారు. ఇలాంటి అంశాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు రాములు, బొడ్డు లక్ష్మణ్, రాజన్న, వసంత్, శ్రీనివాస్, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

