ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తా
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్‌ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖా నాయక్‌కు వినతిపత్రం అందిం చారు
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 22 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్‌ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖా నాయక్‌కు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లా డుతూ రాష్ట్రంలో 3874 మంది ఉద్యోగులు ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారని, తమ కు పేస్కేల్ అమలు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చా రు. జేఏసీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు సుధాకర్, సంజీవ్, రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు, చరణ్, నవీన్, శివాజీ, రామకృష్ణ పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకలకు రండి
ఈనెల 24న జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్టపై నూతనంగా నిర్మిస్తున్న జగదాంబదేవి ఆలయ మందిరం వద్ద అధికారికంగా నిర్వహించనున్న సేవలాల్ జయంతి వేడుకలకు రావాలని కోరు తూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారికి బుధవారం ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు ఆహ్వాన పత్రికను అందించారు. నాయకులు తుకారాంనాయక్, బలరాంనాయక్, రాజేందర్‌నాయక్, తదితరులున్నారు.
రేపు సెలవు
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల ను పురస్కరించుకొని శుక్రవారం విద్యా సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. ఈ సెలవు ను మార్చి 11న రెండో శని వారం తిరిగి పని దినంగా పాటిస్తామని ఆయన పేర్కొన్నారు.
మంత్రి అభినందన
నిర్మల్అర్బన్/నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 22 : నిర్మల్ రూరల్ మండలం ముజ్గి పీహెచ్‌సీకి నేషనల్ ఎన్‌క్యాష్ ధ్రువీకరణ పత్రం రావడంపై వైద్యాధికారులు, వైద్య సిబ్బంది బుధ వారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించా రు. రోగులకు మెరుగైన సేవలందించాలని మంత్రి కోరారు. ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కోటగిరి అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

