బీఆర్ఎస్ వైపే యువత
బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుందని యువతంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన శాంతినగర్ యువత, ప్రజలు
- గులాబీ గూటికి 500 మంది
నిర్మల్ అర్బన్, నవంబర్ 9: బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుందని యువతంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.శాంతినగర్ కాలనీకి చెందిన బీజేపీ యువ నాయకుడు కొండాజీ రాఘవేంద్రచారి, యువకులు, మహిళలు, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ చేరా రు. వీరికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, కాలనీని అభివృద్ధి చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరానని రాఘవేంద్రచారి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాలనీ ప్రజలంతా కలిసి కట్టుగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో అదే ఉత్సాహంతో కారు గుర్తుకు ఓటు వే యాలని ప్రజలను కోరారు. బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నదని, యువత దీనిని గ్రహించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేంధ ర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, అ ల్లోల తిరుపతి రెడ్డి, వార్డు ఇన్చార్జి నితిన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్, కౌన్సిలర్ సంపంగి రవి, కోటగిరి అశోక్ తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

