నస్పూర్, ఏప్రిల్ 22 : మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో అశ్రిత 467, శ్రీనిధి 467, మైత్రి 466, మనోజ్ 466, అరుణశ్రీ 466, రాహుల్ 465, సంజయ్ 465 మార్కులు సాధించారు. బైపీసీలో అఫ్రీన్ 436, హిమవర్షిణి 434, సీఈసీలో ముమీన 489, వైష్ణవి 486, అభిషేక్ 486 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఐ. శృతి 992, అశ్రిత 990, కే. జశ్వంత్ 988, అస్మిత 988, సమన్విత 985, సాయితేజ 982, భవానీ 980 మార్కులు, బైపీసీలో సుధాకర్ 984, వెన్నెల 982, షాహెద సిద్ధిక 981, సీఈసీలో సాక్షి 969, స్పందన 965 మార్కులు సాధించినట్లు మిమ్స్ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరాజు, డైరెక్టర్లు ఉపేందర్‌రెడ్డి, శ్రీధర్‌రావు, విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ శైలజ తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.