ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 3 : ‘ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిం చాం.. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాగైతే చదువుకునేదెలా’ అం టూ వైద్య విద్యార్థులు అసహనం వ్యక్తం చేశా రు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఎదుట శుక్రవారం రెండో రోజూ ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
హుటాహుటిన డీఎంఈ డాక్టర్ వాణి కళాశాలకు చేరుకొని మొదట కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్.. ఇతర అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులు ఆందోళన చేయడంపై ప్రిన్సిపాల్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో రెండు గంటల పా టు సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలు విని ప్రభుత్వానికి నివేదిక అందజేసి త్వరలోనే పరిషారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అంతకుముందు ఏఎస్పీ చిత్తరంజన్ అకడికి చేరుకొని వారిని శాంతింపజేసే యత్నం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని సమస్యలు వెంటనే పరిషరించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాకు వచ్చిన డీఏం ఈ డాక్టర్ వాణికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కార్తీక్, దినకర్ ఉన్నారు.