దస్తురాబాద్, ఏప్రిల్ 14 : దస్తురాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గతేడాది పక్క గ్రామం అయిన పెర్కపల్లెలో పిడుగు పడడంతో పీహెచ్సీలో విద్యుత్ వైరింగ్ కాలిపోయింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో విద్యుత్ సమస్య ఏర్పడింది. దవాఖానలో తొమ్మిది గదులు ఉండగా.. ఐదు గదులకు వి ద్యుత్ సరఫరా లేదు. మందుల స్టోర్ రూం, ల్యాబ్ గది, రోగుల గది, హాల్, ఆపరేషన్ థియే టర్, వ్యాక్సినేషన్ గదిలో విద్యుత్ సమస్య ఉంది.
వైరింగ్ సమస్య వల్ల ఫ్యాన్లు తిరగడం లేదు. లైట్లు వెలగడం లేదు. దీంతో వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాది నుంచి రెగ్యూలర్ డాక్టర్ లేకపోవడం, ఉన్నతాధికారులు పట్టించుకోక ఆసుపత్రి అస్తవ్యస్తంగా మారిం ది. రెగ్యూలర్ వైద్యులను, స్థాయి పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రహరీలేక పశువులు, పందులు వస్తున్నాయి.