నార్నూర్: వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను (Medical camps) గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జితేంద్ర రెడ్డి ( Doctor Jitendra Reddy) కోరారు. మండలంలోని మహాగాన్ సెక్కుగూడ గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.
వర్షాలు కారణంగా ప్రజలు జాగ్రత్తలు వహించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని తెలిపారు. వర్షాకాలం వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటిని నిలువ ఉంచకూడదని, పరిశుభ్రత పాటించాలని, కాచిన వేడి నీళ్లను మాత్రమే తాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో లక్ష్మి , హెచ్ఈవో తులసి దాస్, పీహెచ్ఎన్ సుశీల,,హెల్త్ సూపర్ వైజర్లు చౌహన్ చరణ్ దాస్, సతవ్వా, గణేష్ కుమారి, ఎంఎల్హెచ్పీ హేమ బిందు, ప్రియంక, ఏఎన్ఎం జంగు, ఈశ్వరి, హెల్త్ అసిస్టెంట్, కైలాష్, జవహర్, గోకుల్, దినేష్, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.