కాసిపేట, జనవరి 16 : గిరిజన గ్రామాల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. గురువారం ఆదివాసీ గిరిజన గ్రామం పెద్దాపూర్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రాలు అందించారు. పావుగూడ ఆదివాసీ గిరిజన గ్రామాన్ని సందర్శించాలని గ్రామస్తులు కోరడంతో పీవో కాలి నడకన పత్తి చేల ను దాటుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ని రుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, తప్పకుం డా ఊట్నూర్‌కు రావాలని సూచించారు. డ్రా పౌట్ పిల్లలను గుర్తించి తప్పకుండా చదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. వైద్య శిబిరంలో మొత్తం 146 మందికి పరీక్షలు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సిన వైద్య శిబిరాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, అడిషనల్ డీఎంహెచ్‌వో మనోహర్, ఆర్ఎంవో భీష్మా, డి ప్యూటీ డీఎంహెచ్వోలు సుధాకర్ నాయక్, అనిత, ఎన్సీడీ పీవో ప్రసాద్, వైద్యాధికారి రవి కిరణ్, వైద్యు లు శివ ప్రతాప్, శ్రీ దివ్య, మంచిర్యాల దవాఖాన వైద్యులు, కాసిపేట పీహెచ్సీ సిబ్బంది, ఆర్బీఎస్కే సిబ్బంది, ఆదివాసీ నాయకులు కొమ్ముల బాపు, ఆత్రం మహేశ్ పాల్గొన్నారు.