కుభీర్ : పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి ( Kalyanalakshmi ) , షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ (BRS ) ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి తహసీల్ కార్యాలయం వద్ద బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు అన్నబావు సాటే, చత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ విఠలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈపాటికి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించకపోవడంతో రైతు బీమా పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆందోళనలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, వైస్ ఎంపీపీ మొహియోద్దిన్, సుంకేటపోశెట్టి, ఎన్నిల అనిల్, గంధం పోశెట్టి, బాబు, దొంతుల దేవి దాస్, జి కాశీనాథ్, దేవన్న, చిన్న పార్డి దత్తు, ఏఖినోద్దీన్, గడపాలే దత్తాత్రి, జీవన్, వర్ని రమేష్, చోండి పోతన్న, మాదన్న, నాయకులు పాల్గొన్నారు.